భారతదేశం, ఫిబ్రవరి 27 -- Shruti Haasan: హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది శృతి హాస‌న్‌. సైక‌లాజిక్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో ది ఐ అనే సినిమా చేస్తోంది. ఈ మూవీకి డాఫ్నే ష్మోన్ దర్శకత్వం వ‌హించాడు. వెంచ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ది ఐ మూవీ స్క్రీనింగ్ కాబోతోంది. ఫిబ్ర‌వ‌రి 27 నుండి మార్చి 2 వరకు జరిగే ఈ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో హార‌ర్‌, సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ చిత్రాలను ప్ర‌ద‌ర్శించ‌బోతున్నారు. ఈ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో ప్రారంభ మూవీగా ది ఐ ప్రీమియ‌ర్ కానుంది.

డయానా (శృతి హాసన్) తన భర్త ఫెలిక్స్ (మార్క్ రౌలీ) కోసం సాగించే ప్ర‌యాణం నేప‌థ్యంలో ది ఐ మూవీ తెర‌కెక్కుతోంది. చనిపోయిన తన భర్తను మళ్లీ తిరిగి తీసుకు వచ్చేందుకు డ‌యానా ఏం చేసింది? తన భర్తను వెనక్కి తిరిగి తెచ్చుకునేందుకు డ‌యానా చేసిన‌ త్యాగాలు ఏంటి? అనే క‌థాంశంతో ది ఐ మూవీ తెర‌కెక్కుతోంది.

గ్రీస్, ఏథెన్స్, ...