భారతదేశం, సెప్టెంబర్ 5 -- ఈ రోజు మిలాద్​ ఉన్​ నబీ. ఉపాధ్యాయుల దినోత్సవం కూడా! మరి ఈ రోజు స్టాక్​ మార్కెట్​లు ఓపెన్​లో ఉంటాయా? అని మదుపర్లలో సందేహాలు ఉన్నాయి. శుక్రవారం స్టాక్​ మార్కెట్​లకు ఎటువంటి సెలవు లేదని ట్రేడర్లు, మదుపర్లు తెలుసుకోవాలి. ఎప్పటిలానే, ఈరోజు కూడా స్టాక్​ మార్కెట్​లు యథావిథిగా పనిచేస్తాయి.

గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 150 పాయింట్లు పెరిగి 80,718 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 19 పాయింట్లు వృద్ధిచెంది 24,734 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ మాత్రం 8 పాయింట్లు పెరిగి 54,075 వద్దకు చేరింది.

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 106.34 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,233.09 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు...