భారతదేశం, ఫిబ్రవరి 9 -- సంస్థ చరిత్రలోనే అత్యధిక క్యూ3 లాభాలను నమోదు చేయడంతో.. సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎస్బీఐ (స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా) షేర్లు రాకెట్​లా దూసుకెళుతున్నాయి. రూ. 1,120 వద్ద ఓపెన్​ అయిన ఎస్బీఐ స్టాక్​ 6శాతం మేర లాభాలతో రూ. 1137 వద్ద జీవితకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది.

ఇక ఉదయం 9 గంటల 50 నిమిషాలకు ఎస్బీఐ షేరు ధర 5.6శాతం లాభాలతో రూ. 1125 వద్ద ట్రేడ్​ అవుతోంది.

2025 మార్చ్​లో నమోదైన 52 వారాల కనిష్ట స్థాయి (రూ. 679.65) నుంచి ఈ ఎస్బీఐ షేరు ధర ఇప్పటివరకు 65% పైగా లాభపడింది. గత ఏడాది కాలంలో 44శాతం, గత నెల రోజుల్లోనే 7శాతం మేర వృద్ధిని సాధించింది. ఐదు రోజుల్లో ఈ స్టాక్​ 7శాతం పెరిగింది. నెల రోజుల్లో 12.5శాతం వృద్ధిని నమోదు చేసి ఇన్వెస్టర్లపై లాభాల వర్షాన్ని కురిపిస్తోంది.

నికర లాభం: స్టాండలోన్ ప్రాతిపదికన బ్యాంకు నికర లాభం ...