తెలంగాణ,హైదరాబాద్, ఫిబ్రవరి 22 -- తెలంగాణలో మరికొన్ని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) బ్రాంచ్ లు కొలువుదీరాయి. వీటిని వర్చవల్ గా ఎస్బీఐ ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు ప్రారంభించారు. హైదరాబాద్ సర్కిల్ కేంద్రంగా ఇవి పని చేయనున్నాయి. ఈ కార్యక్రమంలో చీఫ్ జనరల్ మేనేజర్ రాజేశ్ కుమార్ పాల్గొన్నారు.

మొత్తం పది కొత్త బ్రాంచ్ లు ఏర్పాటు చేసినట్లు ఎస్బీఐ అధికారులు తెలిపారు. వీటిలో ఐదు బ్రాంచ్ లను గ్రామీణ పరిధిలో, మరో ఐదింటిని పట్టణం ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. వీటితో కలిపి తెలంగాణలో రాష్ట్రంలోని బ్రాంచ్ ల సంఖ్య 1,206కి చేరినట్లు ఎస్బీఐ ప్రకటించింది.

కాంకరెట్ ఆడిటర్ పోస్టుల భర్తీకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ ద్వారా 1194 పోస్టులను భర్తీ చేయనున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 18న ప్రారంభవ...