Hyderabad, మార్చి 17 -- Sarangapani Jathakam Release Date: సమ్మర్ హాలిడేస్ లో సారంగపాణి మన ముందుకు వస్తున్నాడు. గతేడాది నుంచి వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమాను ఇప్పుడు మేకర్స్.. హాలిడేస్ కోసం రెడీ చేస్తున్నారు. తాజాగా సోమవారం (మార్చి 17) రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు.

మోహనకృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో ప్రియదర్శి నటించిన మూవీ సారంగపాణి జాతకం. ఈ సినిమాను ఏప్రిల్ 18న రిలీజ్ చేయబోతున్నారు. గతేడాదే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన సినిమా ఇది.

కానీ అనుకోని పరిస్థితుల్లో వాయిదా పడింది. శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాను శ్రీదేవి మూవీస్ బ్యానర్లో నిర్మించాడు. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. వివేక్ సాగర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు.

ప్రియదర్శి నటించిన మరో కామెడీ ఎంటర్‌టైనర్ సారంగపాణి జాతకం. ఈ సినిమాకు అష్టా చెమ్మా, జెంటిల్‌మెన్, సమ్మోహనం, వీ చిత్రాల...