Hyderabad, మార్చి 13 -- Sankranthiki Vasthunam TRP Rating: సంక్రాంతికి వస్తున్నాం మూవీ టీమ్ చేసిన పని వాళ్లకు మంచి సక్సెస్ నే తెచ్చి పెట్టింది. తెలుగులో తొలిసారి ఒకే సమయంలో అటు టీవీ, ఇటు ఓటీటీలోకి ఈ సినిమాను తీసుకురావడంతో రెండింట్లోనూ మూవీ దుమ్ము రేపుతోంది. తాజాగా టీవీ ప్రీమియర్ టీఆర్పీ రేటింగ్ లో ఈ మధ్యకాలంలో ఏ ఇతర సినిమాకూ సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకుంది.

సంక్రాంతికి వస్తున్నాం మూవీ మార్చి 1న సాయంత్రం 6 గంటలకు జీ తెలుగు ఛానెల్లో టెలికాస్ట్ అయింది. ఈ సినిమాకు ఏకంగా 15.92 రేటింగ్ నమోదు కావడం విశేషం.

ఇది కేవలం జీ తెలుగు ఎస్‌డీ ఛానెల్లోనే. ఇక జీ తెలుగు హెచ్‌డీలో మరో 2.3 రేటింగ్ వచ్చింది. మొత్తంగా చూస్తే 18కిపైనే రేటింగ్ నమోదైనట్లు లెక్క. ఈ మధ్య కాలంలో మరే తెలుగు సినిమాకు ఇంత రేటింగ్ నమోదు కాలేదు.

నిజానికి కొంత కాలంగా అన్ని సినిమాల...