భారతదేశం, మార్చి 8 -- విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఓటీటీలోనూ అదరగొడుతోంది. ఇప్పటికే ఓటీటీలో రికార్డులను బీట్ చేసిన ఈ చిత్రం.. తాజాగా మరో మైలురాయి అధిగమించింది. థియేటర్లలో అంచనాలను మించి కలెక్షన్లను రాబట్టిన ఈ మూవీ.. స్ట్రీమింగ్‍లోనూ సెన్సేషనల్ రిజల్ట్ దక్కించుకుంటోంది. ఈ క్రమంలో ఇప్పుడు మరో మైల్‍స్టోన్ దాటేసింది.

సంక్రాంతికి వస్తున్నాం చిత్రం జీ5 ఓటీటీలో 300 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను దాటేసింది. ట్రిపుల్ సెంచరీ దాటిందంటూ ఈ విషయాన్ని జీ5 ఓటీటీ నేడు (మార్చి 8) వెల్లడించింది. "వాటే బ్లాక్‍బస్టర్. 300 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను త్వరగా దాటేసింది" అని సోషల్ మీడియాలో జీ5 పోస్ట్ చేసింది. ట్రిపుల్ సెంచరీ అల్టిమేట్ విక్టరీ అంటూ ఓ పోస్టర్ కూడా రివీల్ చేసింది. జీ5లో ఈ మూవీ తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హి...