భారతదేశం, ఫిబ్రవరి 23 -- Sangareddy Teachers Suspended : సంగారెడ్డి జిల్లాలోని కంగ్టి మండల కేంద్రంలో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాల, కళాశాల వసతి గృహంలో విద్యార్థులతో వంటలు చేయించిన ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సస్పెండ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కంగ్టి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల కళాశాలలో విద్యార్థులతో వంటలు చేసిన వార్తలు వెలువబడడంతో వెంటనే కలెక్టర్ నారాయణఖేడ్ ఆర్డీఓ అశోక్ చక్రవర్తిని విచారణకు ఆదేశించారు.
ఆర్డీవో గురువారం పాఠశాలను సందర్శించి విద్యార్థులతో, సిబ్బందితో మాట్లాడి విద్యార్థులు వంట చేసిన విషయం వాస్తవమేనని కలెక్టర్ కు నివేదిక సమర్పించడంతో... ఆర్డీఓ నివేదిక ఆధారంగా పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ జి. మహేష్, టీజీటీ (మ్యాథ్స్ )ఉపాధ్యాయుడు కె.శివకుమార్ ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ క్రాంతి వల్లూరు ఉత్తర్వుల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.