భారతదేశం, ఫిబ్రవరి 16 -- సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. ఓ గిరిజన మహిళ అత్యాచారానికి గురైంది. అది కూడా భర్త కళ్ల ముందే. ఈ ఘటన గురించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్‌ జిల్లాకు చెందిన గిరిజన దంపతులు.. ఈ నెల 2న ఏపీలోని అనంతపురం జిల్లా నేరడిగొండకు పాదయాత్రగా వెళ్లారు. సంత్‌ సేవాలాల్‌‌ను దర్శించుకున్నారు. దర్శనం అనంతరం మళ్లీ ఇంటికి తిరిగొస్తూ.. శుక్రవారం రాత్రి సంగారెడ్డి మండలం ఫసల్‌వాదికి చేరుకున్నారు.

అప్పటికే రాత్రి అయ్యింది. దీంతో ఓ విద్యాపీఠంలో భోజనం చేశారు. పీఠం ఆవరణలోనే చెట్టు కింద నిద్ర పోయారు. అయితే.. ఆ విద్యా పీఠంలో గుడి నిర్మిస్తున్నారు. తమిళనాడుకు చెందిన మాథవన్‌ అనే యువకుడు అక్కడ పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. అతను గిరిజన మహిళపై కన్నేశాడు. భర్త కళ్ల ముందే ఆమెను లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.

భార్యను లాక్కెళ్తుం...