భారతదేశం, ఫిబ్రవరి 3 -- ఇండియన్​ స్మార్ట్​ఫోన్​ మార్కెట్​లో రూ. 25వేల ధరలోపు చాలా ఆప్షన్స్​ ఉన్నాయి. వీటిల్లో ఏది ఏంచుకోవాలి? అని సందేహాలు ఉంటూ ఉంటాయి. మరి మీరు కొత్త స్మార్ట్​ఫోన్​ కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? రూ. 25వేల బడ్జెట్​లోపు ఫోన్​ చూస్తున్నారా? అయితే మీరు శాంసంగ్​ గెలాక్సీ ఎం35 గురించి తెలుసుకోవాల్సిందే

శాంసంగ్ గెలాక్సీ ఎం35 5జీలో 6.6 ఇంచ్​ ఎఫ్​హెచ్ డీ+ సూపర్ అమోఎల్ఈడీ ఇన్ఫినిటీ-ఓ డిస్​ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. ఇది 1,000 నిట్స్ పీక్ బ్రైట్​నెస్​ని అందిస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ + ప్రొటెక్షన్​ ఈ స్మార్ట్​ఫోన్​ సొంతం. శాంసంగ్ ఎక్సినోస్ 1380 ప్రాసెసర్, మాలి-జీ68 ఎంపీ5 జీపీయూతో ఈ ఫోన్ పనిచేస్తుంది. 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్లను యూజర్లు ఎంచుకోవచ్చు. శాంసంగ్ ఎం35 5జీ ఆం...