భారతదేశం, మార్చి 11 -- హోలీ, గుడి పడ్వా, ఉగాది పండుగలను పురస్కరించుకుని స్పెషల్ ఫెస్టివల్ సేల్​ని ప్రవేశపెట్టింది శాంసంగ్ ఇండియా. ఈ ఎగ్జైటింగ్​ సేల్ మార్చ్​ 31 వరకు కొనసాగనుంది. ఎంపిక చేసిన స్మార్ట్ టీవీలపై వివిధ డీల్స్ అందిస్తోంది శాంసంగ్​. వినియోగదారులకు ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, ప్రమోషన్లను సైతం అందిస్తోంది. వివరాల్లోకి వెళితే..

ఈ శాంసంగ్​ ఫెస్టివల్​ సేల్​లో భాగంగా సంస్థ తన ప్రీమియం ఏఐ ఆధారిత స్మార్ట్ టీవీలపై 20 శాతం వరకు క్యాష్​బ్యాక్​ను ఇస్తోంది. అదనంగా, కస్టమర్లు జీరో డౌన్​పేమెంట్ ఆప్షన్లు, ఎక్స్​టెండెడ్​ ఈఎంఐ ప్లాన్​లను 30 నెలల వరకు పొందవచ్చు.

శాంసంగ్ నియో క్యూఎల్​ఈడీ 8కే, నియో క్యూఎల్​ఈడీ 4కే, క్రిస్టల్ 4కే యూహెచ్​డీతో పాటు మరిన్ని స్మార్ట్ టీవీలు ఈ ఆఫర్​లో అందుబాటులో ఉన్నాయి. ఈ డిస్కౌంట్లు 55 ఇంచ్​, అంతకంటే ఎక్కువ స్క్రీన్ పరిమా...