భారతదేశం, మార్చి 12 -- స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఫుల్ ఫామ్‍లో ఉన్నారు. గతేడాది టిల్లు స్క్వేర్ చిత్రంతో బ్లాక్‍బస్టర్ కొట్టిన ఈ భామ.. ఇటీవలే తమిళ మూవీ డ్రాగన్‍తో భారీ సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం తెలుగులో 'పరదా' మూవీ చేస్తున్నారు అనుపమ. ఈ చిత్రానికి సినిమాబండి ఫేమ్ డైరెక్టర్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నారు. రస్టిక్ మిస్టరీ అడ్వెంచర్ మూవీగా ఈ చిత్రం రానుంది. ఇప్పటికే వచ్చిన టీజర్ ఆసక్తిని పెంచింది. పరదాగా గురించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ విషయంలో బయటికి వచ్చింది.

పరదా చిత్రంలో స్టార్ హీరోయిన్ సమంత క్యామియో రోల్‍లో కనిపించనున్నారని తాజాగా సమాచారం బయటికి వచ్చింది. క్లైమాక్స్‌లో సమంత రోల్ సర్‌ప్రైజింగ్‍గా ఉంటుందనే టాక్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. సినిమా ముగింపులో కీలకమైన సమయంలో ఆ పాత్ర ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది. అయి...