భారతదేశం, జనవరి 29 -- మ‌ల‌యాళం రొమాంటిక్ థ్రిల్ల‌ర్ మూవీ ఒరు క‌ట్టిల్ ఒరు మురి థియేట‌ర్ల‌లో రిలీజైన రెండు నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా డిజిట‌ల్ స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను మ‌నోర‌మా మ్యాక్స్ ఓటీటీ సొంతం చేసుకున్న‌ది. త్వ‌ర‌లోనే ఒరు క‌ట్టిల్ ఒరు మురి రిలీజ్ కానున్న‌ట్లు మ‌నోర‌మా మ్యాక్స్ ప్ర‌క‌టించింది. ఫిబ్ర‌వ‌రి ఫ‌స్ట్ వీక్‌లో ఈ మ‌ల‌యాళం మూవీ ఓటీటీలోకి రానున్న‌ట్లు స‌మాచారం.

ఒరు క‌ట్టిల్ ఒరు మురి సినిమాకు శ‌న్వాస్ కే భ‌వ‌కుట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సినిమాలో పూర్ణిమ ఇంద్ర‌జీత్‌, హ‌కీమ్ షా, ప్రియంవ‌ద కీల‌క పాత్ర‌లు పోషించారు. అక్టోబ‌ర్‌లో థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. కాన్సెప్ట్ వెరైటీగా ఉన్నా స్క్రీన్‌ప్లే క‌న్ఫ్యూజింగ్‌గా సాగ‌డం, డ్రామా అనుకున్న స్థాయిలో పండ‌ట‌క‌పోవ‌డంతో ఈ రొమాంటిక్ థ్రిల్ల‌ర్ మూవీ ప్ర...