భారతదేశం, మార్చి 1 -- Romantic Comedy OTT: తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ పాగ‌ల్ వ‌ర్సెస్ కాద‌ల్ థియేట‌ర్ల‌లో రిలీజైన ఆరు నెల‌ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ తెలుగు మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్రీగా కాకుండా 99 రూపాయ‌ల రెంట‌ల్‌తో రిలీజైంది. . పాగ‌ల్ వ‌ర్సెస్ కాద‌ల్ మూవీలో విజ‌య్ శంక‌ర్‌, విషిక హీరోహీరోయిన్లుగా న‌టించారు. ష‌క‌ల‌క శంక‌ర్‌, బ్ర‌హ్మాజీ కీల‌క పాత్ర‌లు పషించారు. ఈ సినిమాకు రాజేష్ ముదునూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

ఈ రొమాంటిక్ కామెడీ మూవీ గ‌త ఏడాది ఆగ‌స్ట్‌లో థియేట‌ర్ల‌లో రిలీజైంది. క‌మ‌ర్షియ‌ల్‌గా అంత‌గా ఆద‌ర‌ణ‌ను ద‌క్కించుకోలేదు. ఈ సినిమాతో ప‌లువురు కొత్త న‌టీన‌టులు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

భిన్న మ‌న‌స్త‌త్వాలు క‌లిగిన రెండు జంట‌ల క‌థ‌తో ద‌ర్శ‌కుడు రాజేష్ పాగ‌ల్ వ‌ర్సెస్ కాద‌ల్ సినిమాను రూపొంది...