భారతదేశం, ఏప్రిల్ 16 -- కిర‌ణ్ అబ్బ‌వ‌రం లేటెస్ట్ రొమాంటిక్ యాక్ష‌న్ మూవీ దిల్‌రుబా ఒకే రోజు రెండు ఓటీటీల‌లో రిలీజ్ కానున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమా స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను ఆహా ఓటీటీతో పాటు ఈటీవీ విన్ సొంతం చేసుకున్నాయి. ఏప్రిల్ 25 నుంచి రెండు ఓటీటీల‌లో స్ట్రీమింగ్ కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

దిల్‌రుబా మూవీకి విశ్వ క‌రుణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సినిమాలో కిర‌ణ్ అబ్బ‌వ‌రానికి జోడీగా రుక్స‌ర్ థిల్లాన్‌, కాథీ డేవిస‌న్ హీరోయిన్లుగా న‌టించారు.

క బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత కిర‌ణ్ అబ్బ‌వ‌రం హీరోగా న‌టించిన ఈ మూవీపై భారీగా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. కానీ రొటీన్ స్టోరీ కార‌ణంగా బాక్సాఫీస్ వ‌ద్ద ఈ మూవీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. కిర‌ణ్ అబ్బ‌వ‌రం యాక్టింగ్‌, క్యారెక్ట‌రైజేష‌న్‌తో పాటు యాక్ష‌న్ ఎపిసోడ్స్ బాగున్నాయ‌నే మాట‌లు వినిపించాయి.

సిద్ధార్థ్ అల...