Hyderabad, ఫిబ్రవరి 12 -- RGV on Allu Arjun Pushpa: పుష్ప, పుష్ప 2 మూవీస్ నార్త్ లో ఎంతటి సంచలనం రేపాయో మనకు తెలుసు. ఈ మూవీస్ తెలుగు రాష్ట్రాల కంటే అక్కడే ఎక్కువ వసూళ్లు సాధించాయి. కానీ ఈ మూవీని, అల్లు అర్జున్ ను గతంలో అక్కడి ప్రొడ్యూసర్లు ఎంత తక్కువ అంచనా వేశారు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వెల్లడించాడు. పింక్‌విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్జీవీ మాట్లాడాడు.

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పుష్ప మూవీ గురించి ఓ హిందీ ప్రొడ్యూసర్ గతంలో చేసిన కామెంట్స్ ను పింక్‌విల్లా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆ ప్రొడ్యూసర్ పేరు మాత్రం అతడు వెల్లడించలేదు. "అతడు పుష్ప 1 మూవీ చూసినప్పుడు నాకు తెలిసిన వ్యక్తితో అతడు ఇలా అన్నాడు.

నార్త్ ప్రేక్షకులు ఈ హీరో ముఖం చూసి వాంతి చేసుకుంటారు అని అన్నాడు. దీనికి డబ్బుతో సంబంధం లేదు. కానీ వ్యక్తిత్వం ఏంటో తెలుస్తోంది" అన...