భారతదేశం, మార్చి 8 -- Rekhachithram Review: మ‌ల‌యాళంలో ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌లో ఒక‌టిగా రేఖ‌చిత్రం నిలిచింది. కేవ‌లం ఆరు కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ అర‌వై కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాలో ఆసిఫ్ అలీ, అన‌స్వ‌ర రాజ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ఇటీవ‌లే సోనీ లివ్ ద్వారా ఓటీటీ ప్రేక్ష‌కుల‌ ముందుకొచ్చిన ఈ మూవీ ఎలా ఉందంటే?

వివేక్ (ఆసిఫ్ అలీ) ఓ పోలీస్ ఆఫీస‌ర్‌. డ్యూటీలో ఉండ‌గా ఆన్‌లైన్ ర‌మ్మీ ఆడుతూ దొరికిపోయి స‌స్పెండ్ అవుతాడు. స‌స్పెన్ష‌న్ ముగిసిన త‌ర్వాత మ‌ల‌క్కాప‌ర అనే ఏరియాలో అత‌డికి పోస్టింగ్ వ‌స్తుంది. డ్యూటీలో జాయిన్ అయిన తొలిరోజే వివేక్‌కు ఓ ఛాలెంజింగ్ కేసు ఎదుర‌వుతుంది. రాజేంద్ర అనే వ్య‌క్తి మ‌ల‌క్కాప‌ర అట‌వీ ప్రాంతంలో గ‌న్‌తో కాల్చుకొని చ‌నిపోతాడు.

తాను చ...