భారతదేశం, జనవరి 26 -- మీరు ఎక్కువగా డేటాను ఉపయోగిస్తుంటే రోజూ 3జీబీ డేటాతో ప్లాన్లు మీకు బెస్ట్ ఆప్షన్. జియో, ఎయిర్‌టెల్, విఐ కంపెనీలు తమ వినియోగదారుల కోసం అనేక ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. వీటిలో ప్రతిరోజూ 3జీబీ డేటా లభిస్తుంది. ఈ కంపెనీలకు చెందిన ప్లాన్స్ గురించి తెలుసుకుందాం..

రూ.449కు జియో రోజువారీ 3జీబీ డేటా ప్లాన్ 28 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ రోజుకు 3 జిబి డేటా(మొత్తం 84జీబీ)తో పాటు అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లను అందిస్తుంది. ఈ ప్లాన్ వినియోగదారులు అపరిమిత 5జీ డేటాకు కూడా అర్హులు. దీని ద్వారా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాక్సెస్ లభిస్తుంది.

రూ.1199 ప్లాన్ వాలిడిటీ 84 రోజులు. రోజుకు 3 జీబీ డేటా (మొత్తం 252జీబీ)తో పాటు అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్ వినియోగదారులు అపరిమి...