భారతదేశం, మార్చి 22 -- రామ్‌చ‌ర‌ణ్, బుచ్చిబాబు కాంబోలో తెర‌కెక్కుతోన్న ఆర్‌సీ 16 మూవీ రిలీజ్ డేట్‌పై ఓ ఆస‌క్తిక‌ర వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. వ‌చ్చే ఏడాది వేస‌వి కానుక‌గా ఈ మూవీ విడుద‌ల‌కానున్న‌ట్లు స‌మాచారం. మార్చి 26ను రిలీజ్ డేట్‌గా ఫైన‌ల్ చేసిన‌ట్లు స‌మాచారం.

రామ్‌చ‌ర‌ణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ల‌లో ఒక‌టిగా నిలిచిన రంగ‌స్థ‌లం మూవీ కూడా మార్చి నెల‌లోనే రిలీజైంది. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ మూవీ 2018 మార్చి 30న ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఆ మార్చి సెంటిమెంట్‌ను ఆర్‌సీ 16 కోసం సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఫాలో అవుతోన్న‌ట్లు మెగా ఫ్యాన్స్ చెబుతోన్నారు. రామ్ చ‌ర‌ణ్ బ‌ర్త్ డే కూడా మార్చి 27 కావ‌డంతో ఈ డేట్ బాగా క‌లిసివ‌స్తుంద‌నే ఆలోచ‌న‌లో మేక‌ర్స్ ఉన్న‌ట్లు స‌మాచారం. ఇదే రిలీజ్ డేట్‌ను ఫైన‌ల్ చేసే అవ‌కా...