భారతదేశం, డిసెంబర్ 9 -- Rashmika Mandanna Kantara Movie: గ‌త కొంత‌కాలంగా ర‌ష్మిక మంద‌న్న‌పై క‌న్న‌డ సినీ అభిమానులు ఫైర్ అవుతోన్న సంగ‌తి తెలిసింది. ర‌ష్మిక మంద‌న్న‌ను బ్యాన్ చేయాలంటూ విమ‌ర్శ‌లు కురిపిస్తున్నారు. క‌న్న‌డ బిగ్గెస్ట్ హిట్ ఫిల్మ్ కాంతార చూడ‌లేదంటూ ర‌ష్మిక స్టేట్‌మెంట్ ఈవ్వ‌డంతో ఈ వివాదం మొద‌లైంది. ఆ త‌ర్వాత త‌న‌ను ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసిన నిర్మాణ సంస్థ పేరును బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో ప్ర‌స్తావించ‌డానికి ర‌ష్మిక ఇష్ట‌ప‌డ‌క‌పోవ‌డంతో ఈ గొడ‌వ పెద్ద‌దైంది.

ర‌ష్మిక‌ను క‌న్న‌డ ఇండ‌స్ట్రీ నుంచి బ్యాన్ చేయాలంటూ సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. ఈ వివాదంపై ఇన్నాళ్లు సెలైంట్‌గా ఉన్న ర‌ష్మిక మంద‌న్న తాజాగా స్పందించింది. కాంతార సినిమాను తాను చూశాన‌ని చెప్పింది. కాంతార సినిమా రిలీజైన రెండో రోజు ...