భారతదేశం, ఫిబ్రవరి 10 -- ప్రముఖ యూట్యూబ్​ ఛానెల్​ బీర్​బైసెప్స్​కి చెందిన​ రణ్​వీర్​ అలహాబాదియా చిక్కుల్లో పడ్డారు! 'ఇండియాస్​ గాట్​ లేటెంట్​ షో'లో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవ్వడం ఇందుకు కారణం. "తల్లిదండ్రులు శృంగారం చేస్తున్న సమయంలో చూస్తావా?" అంటూ ఆయన అడిగిన ప్రశ్నపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ముంబై కమిషనర్​, మహారాష్ట్ర మహిళా కమిషన్​కు రణ్​వీర్​కి వ్యతిరేకంగా ఫిర్యాదులు అందాయి.

సమయ్​ రైనా నిర్వహించే ఇండియాస్​ గాట్​ లేటెంట్​ షోలో కంటెంట్ క్రియేటర్లు ఆశిష్ చంచ్లానీ, జస్ప్రీత్ సింగ్, అపూర్వ ముఖిజాతో పాటు బీర్​బైసెప్స్ పాడాక్యాస్టర్ రణ్​వీర్​ అలహాబాదియా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఒక కంటెస్టెంట్​కి ఆయన వేసిన ప్రశ్న వివాదాస్పదంగా మారింది.

"మీ తల్లిదండ్రులు శృంగారంలో పాల్గొనడాన్ని జీవితం మొత్తం చూస్తావా? లేక ఒ...