Hyderabad, మార్చి 5 -- Ramam Raghavam OTT Release Date: జబర్దస్త్ కమెడియన్ ధనరాజ్ డైరెక్ట్ చేసిన మూవీ రామం రాఘవం. ఈ సినిమా గత నెల 21న థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు మూడు వారాల్లోనే డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. అయితే ఈ తెలుగు థ్రిల్లర్ సినిమా రెండు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ పైకి రానుండటం విశేషం.

రామం రాఘవం మూవీ స్ట్రీమింగ్ తేదీని బుధవారం (మార్చి 5) సన్ నెక్ట్స్ ఓటీటీ అనౌన్స్ చేసింది. మార్చి 14 నుంచి ఈ మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు చెప్పింది. తెలుగుతోపాటు తమిళంలోనూ రానుంది.

"మీరు ఊహించలేని విధంగా సాగే ఓ తండ్రీకొడుకుల కథ ఇది. రామం రాఘవం మార్చి 14 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది" అనే క్యాప్షన్ తో సన్ నెక్ట్స్ ట్వీట్ చేసింది. ఈ సినిమాలో సముద్రఖని, ధనరాజ్, హరీష్ ఉత్తమన్, సత్య, వెన్నెల కిశోర్, శ్రీనివాస్ రెడ్డి, సునీల్, పృథ్వీ రాజ్ నటించారు.

నిజాని...