తెలంగాణ,హైదరాబాద్, ఫిబ్రవరి 14 -- BRS Rajya Sabha Candidates 2024: రాజ్యసభ నామినేషన్ల (Rajya Sabha Elections 2024)గడువు రేపటితో ముగియనుంది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లోని 56 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనుంది ఎన్నికల సంఘం. ఇందులో తెలంగాణ నుంచి మూడు ఖాళీలు ఉన్నాయి. భారత రాష్ట్ర సమితి పార్టీకి(BRS Party) చెందిన బడుగుల లింగయ్య యాదవ్‌, జోగినపల్లి సంతోష్‌ కుమార్‌, వద్దిరాజు రవిచంద్ర రిటైర్ అవుతున్న వారిలో ఉన్నారు. ఈ మూడు స్థాానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మెల్యేల ఓట్ల ద్వారా ఎన్నికయ్యే ఈ సీట్లు ఎవరికి దక్కబోతున్నాయనేది ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

ఎమ్మెల్యేల సంఖ్యా బలం రీత్యా అధికార కాంగ్రెస్ పార్టీకి(Telangana Congress) రెండు స్థానాలను కైవసం చేసుకోవటం ఖాయంగా కనిపిస్తుంది. ఇక బీఆర్ఎస్ ఒక స్థానాన్ని గెలుచుకునే ఛాన్స్ ఉంద...