భారతదేశం, ఫిబ్రవరి 3 -- రైల్వే బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు భారీగా కేటాయింపులు జరిగాయి. రైల్వేబడ్జెట్లో ఏపీకి రికార్డ్ స్థాయిలో కేటాయింపులు జరిగాయి. ఏపీకి రూ.9,417 కోట్లు కేటాయించిన్టటు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. రైల్వే బడ్జెట్లో తెలంగాణకు రూ.5337 కోట్లు కేటాయించారు. కాజీపేటలో రైల్వే ప్రొడక్షన్ యూనిట్ ఏర్పాటు చేస్తామని కేంద్రమంత్రి ప్రకటించారు.
ఇప్పటి వరకు తెలంగాణకు రూ.41,677 కోట్లు మంజూరు అయినట్టు అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. త్వరలో తెలంగాణకు నమో భారత్, అమృత్ భారత్ రైళ్లు రానున్నాయని ప్రకటించారు. ఏపీలో రూ.84,559 కోట్ల పనులు నిర్మాణంలో ఉన్నాయని వివరించారు. ఏపీలో 74 రైల్వేస్టేషన్లు అభివృద్ధి చేశామన్న కేంద్రమంత్రి.. 1560 కి.మీ.కొత్త రైల్వేలైన్ ఏర్పాటు చేశామని చెప్పారు.
Published by HT Digital Content Services with ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.