ఆంధ్రప్రదేశ్,విశాఖ, ఫిబ్రవరి 9 -- ఇండియ‌న్ రైల్వే ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. విజయవాడ డివిజన్‌లో భద్రతా పనుల కారణంగా నాలుగు రైళ్లను రద్దు చేసింది. మరో మూడు రైళ్ల‌ను దారి మ‌ళ్లించింది. విశాఖ‌ప‌ట్నం-సికింద్రాబాద్ వందేభార‌త్ రీషెడ్యూల్ చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను పేర్కొంది.

1. విశాఖపట్నం నుండి బయలుదేరే విశాఖపట్నం-ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ రైలు(నెంబ‌ర్‌ 18519) ఫిబ్ర‌వ‌రి 10 నుంచి ఫిబ్ర‌వ‌రి 20 వ‌ర‌కు రద్దు చేశారు.

2. ఎల్‌టీటీ నుండి బయలుదేరే ఎల్‌టిటి-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ రైలు(నెంబ‌ర్‌ 18520) ఫిబ్ర‌వ‌రి 12 నుండి ఫిబ్ర‌వ‌రి 22 వ‌ర‌కు రద్దు చేశారు.

3. టాటా నగర్ నుండి బయలుదేరే టాటా నగర్-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలు(నెంబ‌ర్‌ 18111) ఫిబ్ర‌వ‌రి 13న ర‌ద్దు చేశారు.

4. యశ్వంత్‌పూర్ నుండి బ‌య‌లుదేరే రైలు నెంబ‌ర్‌ 18112 యశ్వంత్‌పూర్-టాటా నగర్ ...