భారతదేశం, ఏప్రిల్ 25 -- Pushpa 2 The Rule: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న 'పుష్ప 2: ది రూల్' మూవీపై హైప్ ఓ రేంజ్‍లో ఉంది. పాన్ ఇండియా రేంజ్‍లో సినీ జనాలు ఈ చిత్రం కోసం వేయికళ్లతో వేచిచూస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే, ఈ చిత్రం నుంచి తొలి పాట రెడీ అయింది. 'పుష్ప.. పుష్ప' అంటూ ఈ పాట ప్రోమో కూడా ఇటీవల వచ్చింది. అయితే, ఈ ఫుల్ సాంగ్ కంటే ముందే ఓ సర్‌ప్రైజ్ ఇస్తామని మూవీ టీమ్ (ఏప్రిల్ 25) చెప్పింది.

పుష్ప 2: ది రూల్ చిత్రం నుంచి 'పుష్ప..పుష్ప' అనే తొలి పాట మే 1వ తేదీన ఉదయం 11 గంటల 7 నిమిషాలకు రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ పాటకు సంబంధించిన ప్రోమో వచ్చింది. పుష్ప.. పుష్ప.. పుష్ప రాజ్ అంటూ ఉన్న ఈ ప్రోమో సోషల్ మీడియాలో మోతెక్కిపోతోంది. ఈ చిన్న ప్రోమోనే సత్తాచాటుతోంది. దీ...