భారతదేశం, మార్చి 18 -- Puri Jagannadh: డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌కు ఎట్ట‌కేల‌కు హీరో దొరికేశాడు. కోలీవుడ్ వెర్స‌టైల్ యాక్ట‌ర్ విజ‌య్ సేతుప‌తితో పూరి జ‌గ‌న్నాథ్ ఓ మూవీ చేయ‌నున్న‌ట్లు కొద్ది రోజులుగా టాలీవుడ్‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది. పాన్ ఇండియ‌న్ లెవ‌ల్‌లో తెలుగు, త‌మిళంతో పాటు ఇత‌ర భాష‌ల్లో ఈ మూవీ రూపొంద‌నున్న‌ట్లు స‌మాచారం.

కాగా విజ‌య్ సేతుప‌తితో చేయ‌నున్న మూవీకి బెగ్గ‌ర్ అనే టైటిల్‌ను పూరి జ‌గ‌న్నాథ్ ఫిక్స్ చేసిన‌ట్లు తెలిసింది. తెలుగు, త‌మిళ భాష‌ల‌కు సూట‌య్యేలా ఈ టైటిల్‌ను ఖ‌రారు చేసిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

పూరి జ‌గ‌న్నాథ్ గ‌త సినిమాల‌కు పూర్తి భిన్నంగా స‌రికొత్త జాన‌ర్‌లో విజ‌య్ సేతుప‌తితో మూవీ ఉండ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ద‌ర్శ‌కుడిగా త‌న‌ను తాను న‌వ్య రీతిలో ఆవిష్క‌రించుకోవాల‌నే ఆలోచ‌న‌తో ఛాలెంజింగ్‌గా పూరి జ‌గ‌న్నాథ్ ...