భారతదేశం, ఏప్రిల్ 10 -- Premaku Jai Movie: అనిల్ బూర‌గాని, ఆర్ జ్వ‌లిత హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్న ప్రేమ‌కు జై మూవీ ఏప్రిల్ 11న థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతోంది. విలేజ్ ల‌వ్ స్టోరీగా తెర‌కెక్కిన ఈ సినిమాకు శ్రీనివాస్ మ‌ల్లం ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

సీరియ‌ల్ యాక్ట‌ర్ అయిన అనిల్ బూర‌గాని ప్రేమ‌కు జై మూవీతోనే మూవీతోనే హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. ఈ మూవీలో అనిల్ బూర‌గాని మెగాస్టార్ చిరంజీవి అభిమానిగా క‌నిపించ‌బోతున్నాడు. సినిమాల్లో హీరోగా న‌టించాల‌నే ఓ యువ‌కుడు త‌న క‌ల‌ను ఎలా ఎలా నెర‌వేర్చుకున్నాడు?

ఓ అమ్మాయిని ప్రాణంగా ప్రేమించిన అత‌డికి ఆమె ఎందుకు దూర‌మైంది? వారి ప్రేమ‌కు కులాలు, ఆస్తులు ఎలా అడ్డుగోడ‌లుగా నిలిచాయ‌నే పాయింట్‌తో ప్రేమ‌కు జై మూవీ తెర‌కెక్కిన‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు.

ప్రేమ‌కు జై మూవీ గురించి డైరెక్ట‌ర్ మల్లం శ్ర...