భారతదేశం, ఏప్రిల్ 8 -- గర్భధారణ సమయంలో తల్లులకు డయాబెటిస్ వ్యాధి సోకితే అది పిల్లలకు ఆటిజం ప్రమాదానికి గురయ్యేలా చేస్తుందట. ఇది తల్లులతో సహా పిల్లల మెదడు, నాడీ వ్యవస్థలను సమస్యలకు గురిచేస్తుందట. దీనిపై జరిగిన అధ్యయనంలో ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. గర్భవతిగా ఉన్నప్పుడు తల్లులకు డయాబెటిస్ ఉన్నప్పుడు, పిల్లలు న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్తో బాధపడే అవకాశం 28% ఎక్కువగా ఉంటుందట. 56 మిలియన్లకు పైగా తల్లి-బిడ్డ జంటలతో కూడిన 202 మునుపటి అధ్యయనాల డేటాను విశ్లేషిస్తే ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి.

గర్భధారణ సమయంలో డయాబెటిస్ ఉన్న తల్లుల పిల్లలకు ఆటిజంకు 25%, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్‌కు 30%, మానసిక వైకల్యానికి 32% ఎక్కువ అవకాశాలు ఉన్నాయని తేలింది. డయాబెటిస్ లేని తల్లుల పిల్లల్లో కంటే డయాబెటిస్ ఉన్న తల్లులు గర్భవతిగా ఉన్నప్పుడు ఉండే కమ్యూని...