భారతదేశం, మార్చి 10 -- అమృత- ప్రణయ్ లవ్ స్టోరీ.. విషాదాంతమైన ప్రేమ కథ. అమృత, ప్రణయ్ చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఆ స్నేహం ప్రేమగా మారింది. ప్రేమ విషయం పెద్దలకు చెప్పారు. ప్రణయ్ కుటుంబంలో ఒప్పుకున్నారు. కానీ.. కూతురును అమితంగా ప్రేమించే మారుతీరావు మాత్రం ఒప్పుకోలేదు. దీంతో పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. ప్రణయ్ కుటుంబ సభ్యులు ఘనంగా రిసెప్షన్ జరిపించారు.

కానీ.. అమృత తండ్రి మారుతీరావు మాత్రం.. తన కుమార్తె కులాంతర వివాహం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. కూతురును తనకు దూరం చేసిన ప్రణయ్‌పై ఎలాగైన పగ తీర్చుకోవాలి రగిలిపోయాడు. అమృత తన తల్లితో ఫోన్‌లో మాట్లాడేది. తల్లితో మాట్లాడుతూ.. తన రిసెప్షన్ జరిగిన తీరును వివరించింది. తన రిసెప్షన్ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తే.. వేలాది మంది చూశారని అమృతి అప్పట్లో చెప్పినట్టు తెలిసింది. దీ...