భారతదేశం, ఏప్రిల్ 4 -- Prakasam Crime: వివాహేతర సంబంధం తొలిత మిస్సింగ్ కేసుగా భావించిన స్థానికులు, చివ‌రికి గురువారం హ‌త్య కేసుగా పోలీసులు బ‌య‌ట‌పెట్టారు. నిందితులిద్ద‌రూ ప‌రారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలింపు చ‌ర్య‌లు చేప‌డుతున్నారు.

ఈ ఘ‌ట‌న ప్ర‌కాశం జిల్లా ఒంగోలు రూర‌ల్‌ మండ‌లం పాత‌పాడు గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా గురువారం వెలుగులోకి వ‌చ్చింది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్రకారం పాత‌పాడు గ్రామంలో మోర‌బోయిన అర్జున్ రెడ్డి (55), ఆ భార్య సుశీల నివాసం ఉంటున్నారు. అయితే అర్జున్ రెడ్డి భార్య అదే గ్రామానికి చెందిన కాపూరి ర‌మేష్ రెడ్డితో వివాహేత‌ర సంబంధం పెట్టుకుంది. ఈ క్ర‌మంలో ర‌మేష్ రెడ్డి త‌ర‌చూ అర్జున్ రెడ్డి ఇంటికి వెళ్లి వ‌స్తుండేవాడు.

చాలా కాలంగా వీరిద్ద‌రి మ‌ధ్య వివాహేత‌ర సంబంధం కొన‌సాగుతోంది. ఈ విష‌యం తెలుసుకున్న అ...