భారతదేశం, ఫిబ్రవరి 19 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది అన్ని రాశుల వారి జీవితాల్లో కూడా అనేక మార్పులు తీసుకొస్తుంది. త్వరలో గజకేసరి రాజయోగం ఏర్పడబోతోంది. ఇది కొన్ని రాశుల వారి అదృష్టాన్ని మేల్కొనబోతోంది. చంద్రుడు మనసు, భావోద్వేగాలు, మానసిక ప్రశాంతత, సృజనాత్మకత మొదలైన వాటికి కారకుడు. చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకు ఒకసారి తన రాశిని మారుస్తూ ఉంటాడు.

ఫిబ్రవరి 26న మిధున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ సమయంలో గురువుతో సంయోగం చెందుతాడు. ఇప్పటికే గురువు మిధున రాశిలో సంచారం చేస్తున్నాడు. ఈ రెండు గ్రహాల సంయోగంతో గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. ఇది 12 రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులు తీసుకొస్తుంది. కొన్ని రాశుల వారు భారీగా లాభాలను పొందుతారు. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? ఈ రాశుల్లో మీరు ఒకరేమో చూసుకోం...