Hyderabad, ఏప్రిల్ 16 -- Pooja Hegde: ఒకప్పుడు తెలుగు సినిమాలను ఏలిన నటి పూజా హెగ్డే. ఆ తర్వాత అవకాశాలు లేక హిందీ, తమిళ సినిమాల వైపు వెళ్లిపోయింది. అయితే ఆమెకు ఇప్పటికీ సోషల్ మీడియాలో ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు. కానీ ఎంత ఫాలోయింగ్ ఉంటే మాత్రం ఏం లాభం అంటూ ఈ బ్యూటీ నిట్టూరుస్తుంది. ఇంతకీ ఆమె ఏమన్నదో చూడండి.

స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీ రెట్రో ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఇందులో భాగంగా ఈ మధ్య ఓ మీడియా సంస్థకు ఆమె ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో ఆమె సోషల్ మీడియా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అసలు ప్రపంచం, సోషల్ మీడియా పూర్తిగా భిన్నమైనవని ఈ సంద్భంగా ఆమె అనడం గమనార్హం.

"నాకు ఇన్‌స్టాలో 3 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. కానీ అది నా సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర 3 కోట్ల టికెట్లకు గ్యారెంటీ ఇవ్వదు కదా. అలాగే ఎంతో మంది సూప...