భారతదేశం, మార్చి 24 -- Ponguleti On LRS : అక్రమ లేఅవుట్ల రెగ్యులరైజేషన్ స్కీమ్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఎల్ఆర్ఎస్ ఆశించిన స్పందన ఉందన్నారు. అయితే ఇప్పటికైతే ఎల్ఆర్ఎస్ గడువు పెంచే ఆలోచన లేదన్నారు. అక్రమ లేఅవుట్ల రిజిస్ట్రేషన్ చేసిన సబ్రిజిస్ట్రార్లు సస్పెండ్ అవుతున్నారన్నారు. ప్రజలెవ్వరూ ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఎల్ఆర్ఎస్ అమలు చేస్తున్నామన్నారు. భూముల రిజిస్ట్రేషన్‌కు సర్వే మ్యాప్ తప్పనిసరి అని మంత్రి పొంగులేటి తెలిపారు. భూమికి మ్యాప్ లేని వాళ్లకు కూడా సర్వే చేయించి నిర్థారిస్తామన్నారు. భూభారతి అమల్లోకి వచ్చాక రిజిస్ట్రేషన్ల ఛార్జీలు పెరుగుతాయన్న మంత్రి... దాదాపు వెయ్యి మంది సర్వేయర్లను కొత్తగా నియమిస్తామని పేర్కొన్నారు.
Published by HT Digital Content Services with permission from HT Telugu....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.