భారతదేశం, మార్చి 26 -- Thriller OTT: మ‌మ్ముట్టి హీరోగా న‌టించిన మ‌ల‌యాళం మూవీ న‌స్రాని ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ రిలీజైంది. 2007లో థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ దాదాపు 18 ఏళ్ల త‌ర్వాత అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుద‌లైంది. జియో హాట్‌స్టార్‌లో ఈ మూవీ అందుబాటులో ఉంది.

పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన న‌స్రాని మూవీకి జోషి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచిన ఈ సినిమాలో విమ‌లా రామ‌న్ హీరోయిన్‌గా న‌టించింది. క‌ళాభ‌వ‌న్ మ‌ణి, బీజుమీన‌న్‌, ముక్త కీల‌క పాత్ర‌లు పోషించారు. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ అంశాల‌కు పొలిటిక‌ల్‌, ల‌వ్ స్టోరీని జోడించి ద‌ర్శ‌కుడు జోషి ఈ సినిమాను తెర‌కెక్కించాడు. మ‌మ్ముట్టి యాక్టింగ్‌తో పాటు ట్విస్ట్‌లు ఆడియెన్స్‌ను మెప్పించాయి.తెలుగులోనూ అజాత శ‌త్రువు పేరుతో న‌స్రాని డ‌బ్ అయ...