భారతదేశం, ఫిబ్రవరి 6 -- పోకో బడ్జెట్ ధర ఫోన్‌లతో సంచలనం సృష్టిస్తోంది. ఫోన్లపై డిస్కౌంట్లను అందించడం ద్వారా కస్టమర్లను ఆకర్శించే ప్రయత్నం చేస్తోంది. దీని ప్రకారం పోకో ఎం7 ప్రో 5జీ ఫోన్‌పై ఆఫర్‌ నడుస్తోంది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో 21 శాతం తగ్గింపుతో లభిస్తుంది. మీరు బడ్జెట్‌లో కొత్త ఫోన్ కొనాలని చూస్తున్నట్లయితే ఇది బెటర్ ఆప్షన్. ఈ ఫోన్ కొత్త ధర, స్పెసిఫికేషన్లను తెలుసుకుందాం.

పోకో ఎం7 ప్రో 5జీ రెండు స్టోరేజ్ ఆప్షన్లలో అమ్మకానికి ఉంటుంది. ఇందులో అనేక ఏఐ ఫీచర్లు ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా ప్రాసెసర్ పై పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ సోనీ కెమెరా ఉంది. దీనికి 6.67-అంగుళాల డిస్‌ప్లే వస్తుంది. ఈ ఫోన్ ఆఫర్ గురించి చూద్దాం..

పోకో ఎం7 ప్రో 5జీ 6జీబీ ప్లస్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.14,999కి ఉంది. ఈ ఫోన్ అసలు 18,999. అం...