భారతదేశం, ఫిబ్రవరి 18 -- కెనడా టొరంటో పియర్సన్​ అంతర్జాతీయ విమానాశ్రయంలో షాకింగ్​ ఘటన చోటుచేసుకుంది! ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ల్యాండింగ్​కి ప్రయత్నించిన డెల్టా ఎయిర్​లైన్స్​కి చెందిన విమానం క్రాష్​ అయ్యింది. ఆ వెంటనే ఆ భారీ విమానం తలకిందులుగా పడిపోయింది. ఈ ఘటనలో 18మంది గాయపడ్డారు.

పియర్సన్ విమానాశ్రయంలో మంచు నేలపై ల్యాండ్ అవుతుండగా కూలిపోయిన డెల్టా ఎయిర్​లైన్స్ (ఎండీవర్ ఎయిర్ ఫ్లైట్​ 4819) విమానం నుంచి ప్రయాణికులను బయటకు తీస్తున్న పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. భయాందోళనకు గురైన ప్రయాణికులు గ్రౌండ్ సిబ్బంది సాయంతో విమానం నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి.

అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్రంలోని మిన్నియాపోలిస్ నుంచి 76 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో బయలుదేరిన ఎండీవర్ ఎయిర్ ఫ్లైట్​ 4819.. స్థానిక కాలమాన...