భారతదేశం, ఏప్రిల్ 5 -- పీపుల్స్ పల్స్ సంస్థ- సౌత్ ఫస్ట్ వెబ్‌సైట్ 28 మార్చి నుంచి 3 ఏప్రిల్ వరకు 118 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే నిర్వహించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 450 నుండి 500 సాంపిల్స్ సేకరించింది. కంప్యూటరైజ్‌డ్ అసిస్టెడ్‌ టెలిఫోనిక్ ఇంటర్వ్యూస్ (క్యాటీ) / ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయాలు సేకరించి ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే నిర్వహించింది.

ఈ సర్వేలో పురుషులు, మహిళలకు సమాన ప్రాధాన్యత ఇచ్చారు. ఈ సర్వే కేవలం ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అనే అంశంపైన మాత్రమే నిర్వహించడం జరిగింది. అంతేకాని ఆయా నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారు..? ఎవరు ఓడిపోతారు అనే అంశంపై మాత్రం కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గాన్ని ఈ సర్వేలో మినహాయించారు. ఈ సర్వే ప్రకారం 24 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగుందని,...