భారతదేశం, మార్చి 15 -- మల్టీబ్యాగర్​ స్టాక్స్​కి ఉన్న హైప్​, క్రేజ్​ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఇక మల్టీబ్యాగర్​ పెన్నీ స్టాక్స్​ కోసం మదుపర్లు ఎప్పటికప్పడు వెతుకుతూనే ఉంటారు. ఇలాంటి స్టాక్స్​లో ఒకటి టీసీపీఎల్​ ప్యాకేజింగ్​! ఈ స్టాక్​ రూ. 1లక్షను ఏకంగా రూ. 5.45 కోట్లుగా మార్చింది. వివరాల్లోకి వెళితే..

డాట్ కామ్ బబుల్ పతనం తర్వాత టీసీపీఎల్ ప్యాకేజింగ్ షేరు ధర రూ.10 దిగువకు పడిపోయింది. 2002 మార్చ్​ 13న బీఎస్ఈలో టీసీపీఎల్ ప్యాకేజింగ్ షేరు ధర రూ.7.95 వద్ద ముగిసింది. ఎవరైనా ఈ పాయింట్​లో టీసీపీఎల్ ప్యాకేజింగ్ షేర్లను కొనుగోలు చేసి, ఈ రోజు వరకు కంటిన్యూ చేసి ఉంటే, ఈ 22 సంవత్సరాలలో ఆ పెట్టుబడి విలువ 545 రెట్లు పెరిగేది! ఇటీవలి దశాబ్దాల్లో భారతీయ స్టాక్ మార్కెట్ అందించిన మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్స్​లో టీసీపీఎల్ ప్యాకేజింగ్ షేర...