భారతదేశం, మార్చి 7 -- అంతర్జాతీయ, స్థానిక ప్రతికూలతలను అధిగమించడానికి కంపెనీలు చేస్తున్న ప్రయత్నాలు ఉద్యోగుల జీతాలపై పడే అవకాశం ఉంది! ఈ మేరకు భారతీయ కంపెనీల్లో సగటు వేతన పెంపు అన్నది 2024తో పోల్చితే 2025లో తక్కువే ఉంటుందని ఓ నివేదిక పేర్కొంది. 2024లో 9 శాతం నుంచి 2025 నాటికి 8.8 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది.

డెలాయిట్ నిర్వహించిన సర్వే ప్రకారం.. కంపెనీలకు 2025లో పరిహార వ్యయ బడ్జెట్లను ఆప్టిమైజ్ చేయడంపై "స్పష్టమైన దృష్టి" ఉంది. ఇది తక్కువ వేతన పెరుగుదలకు దారితీసే అవకాశం ఉంది.

8.8శాతంగా ఉండే ఈ సగటు భారత ఇంక్రిమెంట్ అనేది దశాబ్దంలో అత్యల్పంగా (2020-2021 మినహా) ఉంటుందని ఆడిట్ సంస్థ తెలిపింది.

డెలాయిట్ ఇండియా టాలెంట్ ఔట్​లుక్ 2025 సర్వే ప్రకారం 75 శాతం కంపెనీలు తమ వేతన పెంపును గత ఏడాదితో పోల్చితే తగ్గిస్తాయి, లేదా అలాగే ఉంచుతాయి.

చాలా...