ఆంధ్రప్రదేశ్,తెలంగాణ, మార్చి 15 -- జనసేన ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హిందీ భాషాపై కీలక వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం అంటే సమాజంలో అందరికీ మేలు జరగాలని కోరుకోవడమే అని చెప్పారు. దేశంలో బహు భాషలు అవసరం ఉందన్న ఆయన. ఉత్తరాది, దక్షిణాది అని పదేపదే మాట్లాడటం సబబు కాదని స్పష్టం చేశారు. నియోజకవర్గాల పునర్విభజనపై చర్చ అవసరం ఉందని. దేశాన్ని ముక్కలు చేసే ఆలోచనలు తప్పు అన్నారు. సెక్యూలరిజం పేరుతో ఒక్కోక్కరికి ఒక్కో న్యాయం అంటే ఎలా..? అని ప్రశ్నించారు.

ఈ సందర్భంగా తమిళనాడు నేతలను ఉద్దేశిస్తూ. పవన్ కల్యాణ్ పలు ప్రశ్నలు సంధించారు. "తమిళనాడులో సంస్కృతాన్ని తిడుతున్నారు. దక్షిణాదిపై హిందీని రుద్దుతున్నారంటూ మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు తమిళ సినిమాలను హిందీలో డబ్బింగ్‌ చేయెద్దు కదా.? మీకు డబ్బులేమో ఉత్తరాధి ...