భారతదేశం, ఫిబ్రవరి 15 -- Pawan Kalyan : విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో 'యుఫోరియా మ్యూజికల్ నైట్' అంగరంగ వైభవంగా జరిగింది. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఆధ్వర్యంలో మ్యూజికల్ నైట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, సినీ నటుడు బాలకృష్ణ పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి భారీ స్పందన వచ్చింది.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ...ఎలాంటి ప్రచార హంగామా లేకుండా సేవ చేసుకుంటూ వెళ్లడం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌కు ఉన్న ప్రత్యేకత అన్నారు. మరో వందేళ్ల పాటు ఈ ట్రస్ట్ కొనసాగాలని పవన్ ఆకాంక్షించారు. నారా భువనేశ్వరి అంటే తనకు ఎంతో అపారమైన గౌరవం అన్నారు. ఎన్ని కష్టాలు, ఒడుదొడుకుల్లో ఎదురైనా బలమైన సంకల్పంతో నిలబడ...