భారతదేశం, ఫిబ్రవరి 17 -- పాడేరులో ఓ ఇంగ్లిష్ మీడియం స్కూలు ఉంది. అ పాఠశాలలో ఓ గిరిజన విద్యార్థినిపై.. అదే స్కూళ్లో చదువుతున్న టెన్స్ స్టూడెంట్స్ దాడి చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జనవరి 5న ఏడో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిపై.. టెన్త్ క్లాస్ చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు దాడి చేశారు. ఈ దృశ్యాలను సెల్ఫోన్లో రికార్డ్ చేశారు.
ఈ వీడియో బయటకు ఎలా వచ్చిందో తెలియదు గానీ.. ఫిబ్రవరి 16న వాట్సాప్ గ్రూపుల్లో వైరల్‌గా మారింది. ఈ విషయం తెలుసుకున్న పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆ స్కూలు హాస్టల్‌ను సందర్శించారు. పాఠశాల నిర్వాహకులు, విద్యార్థినులతో మాట్లాడారు. సంఘటన గురించి ఆరా తీశారు. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడొద్దని సూచించారు.
సదరు పాఠశాల వివాదాలకు నిలయంగా మారిందని ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.