భారతదేశం, ఫిబ్రవరి 17 -- పాడేరులో ఓ ఇంగ్లిష్‌ మీడియం స్కూలు ఉంది. అ పాఠశాలలో ఓ గిరిజన విద్యార్థినిపై.. అదే స్కూళ్లో చదువుతున్న టెన్స్ స్టూడెంట్స్ దాడి చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జనవరి 5న ఏడో తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిపై.. టెన్త్ క్లాస్ చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు దాడి చేశారు. ఈ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేశారు.

ఈ వీడియో బయటకు ఎలా వచ్చిందో తెలియదు గానీ.. ఫిబ్రవరి 16న వాట్సాప్‌ గ్రూపుల్లో వైరల్‌గా మారింది. ఈ విషయం తెలుసుకున్న పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆ స్కూలు హాస్టల్‌ను సందర్శించారు. పాఠశాల నిర్వాహకులు, విద్యార్థినులతో మాట్లాడారు. సంఘటన గురించి ఆరా తీశారు. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడొద్దని సూచించారు.

సదరు పాఠశాల వివాదాలకు నిలయంగా మారిందని ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు....