తెలంగాణ,హైదరాబాద్, మార్చి 27 -- దూర విద్యలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ మేరకు ఉస్మానియా విశ్వవిద్యాలయం డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్(డిస్టెన్స్) కార్యాలయం నుంచి ప్రకటన జారీ అయింది. 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఫేజ్ -2 ప్రవేశాల కింద అడ్మిషన్లు కల్పిస్తారు. ప్రవేశ పరీక్ష కోసం ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.

ఈ కోర్సుల్లో ప్రవేశాలకు మార్చి 24 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ గడువు మార్చి 27వ తేదీతో పూర్తవుతుంది. మార్చి 28వ తేదీన ఎంట్రెన్స్ పరీక్షను నిర్వహించనున్నారు. తెలంగాణ ఐసెట్- 2024లో అర్హత సాధించిన అభ్యర్థులు నేరుగా ఈ కోర్సుల్లో అడ్మిషన్లను పొందవచ్చు. ప్రత్యేకంగా ప్రవేశపరీక్షకు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు.

ఇక దరఖాస్తు చేసుకునే అభ‌్యర్థులు కనీస విద్యార్హతలు కలిగి ఉండాలి. ఎంబీఏ కోర...