Hyderabad, ఏప్రిల్ 3 -- OTT Weekend Watch: నెట్‌ఫ్లిక్స్, ఆహా వీడియో ఓటీటీ, ఈటీవీ విన్, జియోహాట్‌స్టార్ లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఈ వారం కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ ఉన్నాయి. వీటిలో రెండు మలయాళం సినిమాలు, రెండు తెలుగు వెబ్ సిరీస్ ఎంతో ఆసక్తి రేపుతున్నాయి. మరి ఆ మూవీస్, సిరీస్ ఏవి? ఎక్కడ చూడాలో తెలుసుకోండి.

గతంలో ఈటీవీ విన్ ఓటీటీలో వచ్చిన #90's వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు. ఇప్పుడదే కోవలో మరో వెబ్ సిరీస్ తెలుగులో వస్తోంది. ఈ సిరీస్ పేరు హోమ్ టౌన్. ఈ సిరీస్ ఆహా వీడియో ఓటీటీలో శుక్రవారం (ఏప్రిల్ 4) నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్ లో వస్తున్న మరో వెబ్ సిరీస్ ఇది. తన కొడుకు యూఎస్ వెళ్లాలని కలలు కనే ఓ తండ్రి, ఆ కలను నెరవేర్చలేక తంటాలు పడే ఓ కొడుకు, అతని స్నేహితుల చుట్టూ తిరిగే కథ ఇది.

టాలీవుడ...