భారతదేశం, ఆగస్టు 4 -- వివిధ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో ఈనెల (ఆగస్టు) కొన్ని వెబ్ సిరీస్‍లు స్ట్రీమింగ్‍కు రానున్నాయి. వీటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ ముఖ్యమైన సిరీస్‍లు ఉన్నాయి. మలయాళ స్టార్ నటీనటులు కలిసి చేసిన మనోరతంగల్ వెబ్ సిరీస్ ఈనెలలోనే స్ట్రీమింగ్‍కు రానుంది. ఎంతోకాలం నుంచి వేచిచూస్తున్న ఈ సిరీస్ అడుగుపెట్టనుంది. డిటెక్టివ్ సిరీస్ శేఖర్ హోమ్స్ సిరీస్ కూడా రానుంది. త్రిష బృంద సిరీస్ ఇప్పటికే స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఇలా.. ఈనెల ఓటీటీల్లో టాప్-5 వెబ్ సిరీస్‍లు ఇవే.

ఎంతో కాలం నుంచి వేచిచూస్తున్న మనోరతంగల్ ఎట్టకేలకు స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది. ఈ ఆంథాలజీ డ్రామా సిరీస్ ఆగస్టు 15వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. లోకనాయకుడు కమల్ హాసన్, మలయాళ సూపర్ స్టార్లు మమ్ముట్టి, మోహన్‍లాల్‍, ఫాహద్ ఫాజిల్ ఈ సిరీస్‍లో ప్రధాన పాత్రలు పోషి...