భారతదేశం, జనవరి 26 -- ఆహా ఓటీటీలో ఇవాళ (జనవరి 26) ట్రెండింగ్‌లో టాప్ 10 సినిమాలు ఉన్నాయి. అందులో ఆహా అనిపించేలా ఐదు సినిమాలు తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. హారర్ థ్రిల్లర్ నుంచి బోల్డ్ వరకు డిఫరెంట్ జోనర్లలో ఓటీటీ రిలీజ్ అయిన ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఆది సాయి కుమార్ నటించిన లేటెస్ట్ తెలుగు హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ శంబాల. యుగంధర్ ముని దర్శకత్వం వహించిన ఈ సినిమా వెయ్యేళ్ల చరిత్రగల ఓ గ్రామాన్ని పట్టి పీడిస్తున్న బండ భూతం చుట్టూ తిరుగుతుంది.

జనవరి 22 నుంచి ఆహాలో శంబాల ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఇవాళ టాప్ 1 స్థానంలో ఓటీటీ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది శంబాల. మంచి మిస్టరీ హారర్ థ్రిల్లర్స్‌ చూడాలనుకునేవారికి శంబాల బెస్ట్ ఛాయిస్.

ఆహా ఓటీటీలోకే స్ట్రీమింగ్‌కు వచ్చిన తెలుగు డబ్బింగ్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్...