భారతదేశం, ఏప్రిల్ 14 -- మలయాళ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ఆఫీసర్ ఆన్ డ్యూటీ, తమిళ కామెడీ మూవీ డ్రాగన్.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్‍బస్టర్లు అయ్యాయి. థియేటర్లలో దుమ్మురేపాయి. ఈ రెండు చిత్రాలు ఒకే వారం.. ఒకే ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు వచ్చాయి. మంచి వ్యూస్ దక్కించుకొని సత్తాచాటుతున్నాయి. ఈ రెండు సినిమాలు స్ట్రీమింగ్‍కు వచ్చిన మూడు వారాలు అవుతున్నా ఇంకా టాప్-10లోనే ట్రెండ్ అవుతున్నాయి. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఆఫీసర్ ఆన్ డ్యూటీ సినిమా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో మొదటి నుంచే అదరగొడుతోంది. మంచి క్రేజ్‍తో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టిన ఈ మూవీ భారీ వ్యూస్ సాధిస్తోంది. కొన్ని రోజుల పాటు నెట్‍ఫ్లిక్స్ ఇండియా సినిమాల ట్రెండింగ్‍ లిస్టులో టాప్‍లో నిలిచింది. ప్రస్తుతం (ఏప్రిల్ 14) ఈ చిత్రం నెట్‍ఫ్లిక్స్‌లో ఏడో స్థానంలో ట్రెండ్ అవుతోంది.

కు...