భారతదేశం, ఫిబ్రవరి 10 -- ఓటీటీలో హారర్ థ్రిల్లర్లు అదరగొడుతున్నాయి. డిజిటల్ స్ట్రీమింగ్ లో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్నాయి. ప్రస్తుతం జియోహాట్‌స్టార్‌ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఈ హారర్ సినిమాలదే డామినెన్స్ నడుస్తోంది. ఓ వైపు తెలుగు సినిమా 'ది రాజాసాబ్', మరోవైపు మలయాళం మూవీ 'సర్వం మాయ' ఓటీటీని షేక్ చేస్తున్నాయి. డిజిటల్ వ్యూస్ తో దూసుకెళ్తున్నాయి.

సంక్రాంతి 2026 సందర్బంగా థియేటర్లలో రిలీజైన రాజాసాబ్ డిజాస్టర్ గా నిలిచింది. పెట్టిన బడ్జెట్ కూడా రాబట్టలేకపోయింది. కానీ ఓటీటీలో మాత్రం ప్రభాస్ హీరోగా నటించిన ఈ రాజాసాబ్ మూవీ అదరగొడుతోంది. ఈ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ కు డిజిటల్ ఆడియన్స్ జై కొడుతున్నారు. జియోహాట్‌స్టార్‌ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రాజాసాబ్ ఇండియాలోనే నంబర్ వన్ మూవీగా ట్రెండ్ అవుతోంది.

రాజాసాబ్ మూవీ జియోహాట్‌స్టార్‌ లో తెలుగుతో పాటు తమిళం,...